జాన్ బోర్గ్
స్వీడన్ దేశ టెన్నిస్ ఆటగాడు / From Wikipedia, the free encyclopedia
జాన్ బోర్గ్ (Björn Rune Borg) 1956, జూన్ 6న స్వీడన్ రాజధాని నగరం స్టాక్‌హోంలో జన్మించాడు. ఇతడు స్వీడన్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమమైన ఆటగాళ్ళలో జాన్ బోర్గ్ ఒకడు. [1][2][3].
9 సంవత్సరాల పాటు 27 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టైటిళ్ళ కోసం పోటీపడి 41% విజయ శాతంతో 11 టైటిళ్ళను చేజిక్కించుకున్నాడు. మొత్తం 141 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లలో 89.8% విజయ శాతంతో 141 మ్యాచ్‌లు గెలుపొందినాడు. బోర్గ్ ఓడిపోయిన మ్యాచ్‌ల సంఖ్య కేవలం 16 మాత్రమే. అందులో 5 సార్లు ఫైనల్ దశకు చేరుకొని ఫైనల్లో అమెరికాకు చెందిన జిమ్మీ కానర్(2), జాన్ మెకెన్రో (3) ల చేతిలో పరాజయం పొందినాడు.