చింతామణి నాగేశ రామచంద్ర రావు
భారత దేశపు రసాయన శాస్త్రవేత్త / From Wikipedia, the free encyclopedia
సి.ఎన్.ఆర్.రావుగా ప్రసిద్ధిచెందిన చింతామణి నాగేశ రామచంద్ర రావు (కన్నడభాష: ಚಿಂತಾಮಣಿ ನಾಗೇಶ ರಾಮಚಂದ್ರ ರಾವ್) (జూన్ 30, 1934) భారతీయ శాస్త్రవేత్త. భారతరత్న పురస్కార గ్రహీత. ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు రసాయన శాస్త్ర పరిశోధకుడు. సాలిడ్ స్టేట్, స్ట్రక్చరల్ కెమిస్ట్రీ విభాగంలో అనేక అంశాలు ఆయన వెలుగులోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 60 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. సి.వి.రామన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంల తరువాత భారతరత్న అవార్డుకు ఎంపికైన మూడో శాస్త్రవేత్త.
త్వరిత వాస్తవాలు C.N.R. Rao (ಸಿ. ಎನ್. ಆರ್. ರಾವ್ ), జననం ...
C.N.R. Rao (ಸಿ. ಎನ್. ಆರ್. ರಾವ್ ) | |
---|---|
జననం | (1934-06-30) 1934 జూన్ 30 (వయసు 89) బెంగళూరు, మైసూరు రాజ్యం, బ్రిటీష్ ఇండియా |
నివాసం | భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
రంగములు | రసాయన శాస్త్రం |
వృత్తిసంస్థలు | ఇస్రో ఐఐటి కాన్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాంటా బార్బరా జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాంస్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ |
చదువుకున్న సంస్థలు | మైసూరు విశ్వవిద్యాలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం పర్డ్యూ విశ్వవిద్యాలయం |
ప్రసిద్ధి | సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ మెటీరియల్ సైన్స్ |
ముఖ్యమైన పురస్కారాలు | హ్యూగ్స్ మెడల్ (2000) ఇండియన్ సైన్స్ అవార్డ్ (2004) (రాయల్ సొసైటీ) (1984) అబ్దుస్ సలాం మెడల్ (2008) డాన్ డేవిడ్ ప్రైజ్ (2005) లీజియన్ ఆఫ్ ఆనర్ (2005) పద్మశ్రీ (1974) పద్మ విభూషణ్ (1985) భారతరత్న (2013) |
మూసివేయి