కేప్ వర్దె
From Wikipedia, the free encyclopedia
కేప్ వర్దె లేదా కేబో వెర్డే అధికారికంగా కాబో వెర్డే రిపబ్లిక్[1] కేంద్ర అట్లాంటిక్ మహాసముద్రంలో 10 అగ్నిపర్వత ద్వీపసమూహం విస్తరించి ఉన్న ఒక ద్వీప దేశం. ఇందులో అజోరెస్, కానరీ ఐలాండ్స్, మదీరా, సావేజ్ దీవులతో పాటు మాకారోనెసియా పర్యావరణ ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. పురాతన కాలంలో ఈ ద్వీపాలు "బ్లెస్డ్ దీవులు" లేదా "అదృష్టకరమైన ద్వీపాలు"గా సూచించబడ్డాయి. పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ వెర్డే ద్వీపకల్పం 570 కిలోమీటర్ల (350 మైళ్ళు) పశ్చిమాన ఉన్న ఈ ద్వీపసమూహాలు మొత్తం 4,000 చదరపు కిలో మీటర్లు (1,500 చదరపు మైళ్ళు) వైశాల్యంలో విస్తరించి ఉంటాయి.4,000 square kilometres (1,500 sq mi).
República de Cabo Verde Republic of Cape Verde |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం Cântico da Liberdade |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | Praia 14°55′N 23°31′W | |||||
అధికార భాషలు | Portuguese | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | Cape Verdean Creole | |||||
ప్రభుత్వం | Republic | |||||
- | President | Pedro Pires | ||||
- | Prime Minister | José Maria Neves | ||||
Independence | from Portugal | |||||
- | Recognized | July 5 1975 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 4,033 కి.మీ² (172nd) 1,557 చ.మై |
||||
- | జలాలు (%) | negligible | ||||
జనాభా | ||||||
- | July 2006 అంచనా | 420,979 (165th) | ||||
- | 2005 జన గణన | 507,000 | ||||
- | జన సాంద్రత | 126 /కి.మీ² (79th) 326 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $3.055 billion (158th) | ||||
- | తలసరి | $6,418 (92nd) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.722 (medium) (106th) | |||||
కరెన్సీ | Cape Verdean escudo (CVE ) |
|||||
కాలాంశం | CVT (UTC-1) | |||||
- | వేసవి (DST) | not observed (UTC-1) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .cv | |||||
కాలింగ్ కోడ్ | +238 |
15 వ శతాబ్దం వరకు కేప్ వెర్డే ద్వీపసమూహం జనావాసరహితంగా ఉండేవి. పోర్చుగీసు అన్వేషకులు ఈ ద్వీపాలను గుర్తించి వచ్చి ఉష్ణమండలంలో మొట్టమొదటి ఐరోపా స్థావరాన్ని ఏర్పాటు చేశారు. అట్లాంటిక్ బానిస వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న ఈ ద్వీపాలు 16 వ, 17 వ శతాబ్దాల్లో వ్యాపారులను, సముద్రపు బందిపోట్లను ఆకర్షిస్తూ సంపన్నంగా అభివృద్ధి చెందాయి. 19 వ శతాబ్దంలో బానిసత్వం ముగింపు ఆర్థిక తిరోగమనం, వలసలకు దారితీసింది. కేప్ వర్దే క్రమంగా తిరిగి ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా, నౌకామార్గాల్లో విశ్రాంతికేంద్రంగా మారింది.. 1951 లో పోర్చుగలు విదేశీ భూభాగంగా చేర్చబడింది. తరువాత ద్వీపవాసులు స్వాతంత్ర్యం పోరాటం కొనసాగించారు. 1975లో శాంతియుతంగా స్వాతంత్ర్యం సాధించబడింది.
1990 ల ప్రారంభం నుండి, కేప్ వెర్డే ఒక స్థిరమైన ప్రతినిధి ప్రజాస్వామ్యం, ఆఫ్రికాలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా మిగిలిపోయింది. సహజ వనరులు తగినంత లేని కారణంగా ఆర్థికాభివృద్ధికి సేవారంగం అధికంగా ప్రాధాన్యత వహిస్తుంది. పర్యాటక రంగం, విదేశీ పెట్టుబడుల మీద దృష్టిసారిస్తుంది. దాదాపు 5,40,000 జనాభాలో మిశ్రమ యూరోపియన్లు, మొరీషియన్లు, అరబ్బులు, ఆఫ్రికను వారసత్వం కలిగిన ప్రజలు అధికంగా ఉన్నారు. పోర్చుగీసు పాలన వారసత్వంగా సంఖ్యాపరంగా రోమను క్యాథలిక్కుల ఆధిక్యత కనిపిస్తుంది. ఈ ద్వీపాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ ఉపాధిదారులు అధికంగా కనిపిస్తున్నారు.
చారిత్రాత్మకంగా "కేప్ వర్దె" అనే పేరు ఆంగ్ల భాషలో ద్వీపసమూహం అనే పదానికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. 1975 లో స్వతంత్రం పొందిన తరువాత దేశానికి ఈ పేరు నిర్ణయించబడింది.