ఓపెన్స్ట్రీట్మేప్(OSM)
From Wikipedia, the free encyclopedia
ఓపెన్ స్ట్రీట్ మేప్ ( OSM ) అనేది స్వేచ్ఛగా సవరించగలిగే, స్వేచ్ఛగా వాడుకొనగలిగే ప్రపంచ పటాలను రూపొందించడానికి ఒక సహకార ప్రాజెక్ట్. పటం కంటే, ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన డేటా ప్రాథమిక ఉత్పత్తిగా పరిగణించబడుతుంది. OSM సృష్టి, పెరుగుదల, ప్రపంచంలోని పటం సమాచారం ఉపయోగం లేదా లభ్యతపై పరిమితులు, చవకైన వెంటతీసుకొనివెళ్లగల ఉపగ్రహ నావిగేషన్ పరికరాల (GPS) లభ్యంకావడంపై ఆధారపడింది.[5] స్వచ్ఛంద భౌగోళిక సమాచారానికి OSM ఒక ప్రముఖ ఉదాహరణగా పరిగణించబడుతుంది.
Type of site | సహకారంతో భౌగోళిక పటములు చేయడం |
---|---|
Available in | వాడుకరి అంతర్వర్తి: 93 భాషలు[1] మేప్ డేటా: వాడుకరి స్థానిక భాష |
Owner | ఓపెన్స్ట్రీట్మేప్ సముదాయం. ప్రాజెక్టు తోడ్పాటు ఓపెన్స్ట్రీట్మేప్ ఫౌండేషన్[2] |
Created by | స్టీవ్ కోస్ట్ (OSMలో వాడుకరి పేజీ) |
URL | openstreetmap.org |
Commercial | కాదు |
Registration | వీక్షకులకు అవసరంలేదు, పటము చేర్చేవారికి కావాలి. |
Users | 5,496,827 [3] |
Launched | 9 ఆగస్టు 2004; 19 సంవత్సరాల క్రితం (2004-08-09)[4] |
Current status | క్రియాశీలం (click to see in detail) |
Content license | ODbL |
నకలుహక్కులు రక్షించబడిన మేప్ ల ఆధిక్యతకు వ్యతిరేకంగా, వికీపీడియా విజయం ఇచ్చిన స్ఫూర్తితో [6] స్టీవ్ కోస్ట్ అనే వ్యక్తి యునైటెడ్ కింగ్డమ్ లో దీనిని 2004 లో రూపొందించాడు [7] అప్పటి నుండి, ఇది రెండు మిలియన్లకు పైగా నమోదైన వినియోగదారులకు పెరిగింది.[8] వీరు మానవీయ సర్వే, GPS పరికరాలు, ఆకాశ ఫోటోగ్రఫీ మొదలైన ఇతర ఉచిత వనరులను ఉపయోగించి సమాచారాన్ని సేకరించుతారు. ఈ డేటాను ఓపెన్ డేటాబేస్ లైసెన్సు క్రింద అందుబాటులో ఉంచారు. ఈ ప్రాజెక్టును ఇంగ్లాండ్, వేల్స్ లో నమోదు అయిన లాభాపేక్షలేని సంస్థ అయిన ఓపెన్స్ట్రీట్మేప్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది.
OSM డేటాను గూగుల్ మేప్స్ కు బదులుగా ఫేస్బుక్, క్రెయిగ్స్, ఓస్మాండ్(OSMand), జియోకాచింగ్(Geocaching, మ్యాప్క్వెస్ట్(Mapquest), ఓపెన్, JMP స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్, ఫోర్స్క్వేర్ వంటి సాధారణ అనువర్తనాలలో,వికీపీడియా లో, అసాధారణ GPS రిసీవర్లలో నింపటానికి వాడతారు..[9] OSM డేటా, స్వేచ్ఛా హక్కులు లేని మేప్ డేటా మూలలతో పోలిస్తే బాగానే ఉంది,[10] అయితే డేటా నాణ్యత ప్రపంచ వ్యాప్తంగా అక్కడి వాడుకరుల క్రియాశీలతనిబట్టి మారుతుంది.[11]