ఆర్థిక సంక్షోభం
ఉన్నట్టుండి ఆస్థుల భారీగా విలువ కోల్పోయే పరిస్థితి / From Wikipedia, the free encyclopedia
ఆర్థిక సంక్షోభం (ఆంగ్లం: Financial Crisis) అంటే కొన్ని ద్రవ్యపరమైన ఆస్తులు ఉన్నట్టుండి తమ నామమాత్ర మూల్యాన్ని (nominal value) కోల్పోయే విస్తృతమైన పరిస్థితి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవడం, ఆర్థిక బుడగలు పేలిపోవడం, ద్రవ్య (కరెన్సీ) సంక్షోభం, ప్రభుత్వం తాము చేసిన అప్పులు చెల్లించకపోవడం మొదలైనవి ఆర్థిక సంక్షోభం కిందికి వస్తాయి.[1][2] చాలామంది ఆర్థికవేత్తలు ఆర్థిక సంక్షోభాలు ఎందుకు ఏర్పడతాయి, వాటిని ఎలా నివారించాలనేందుకు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించారు. కానీ వాటి శాస్త్రీయత మీద ఆర్థికవేత్తలకు ఏకాభిప్రాయం లేదు. అప్పుడప్పుడూ ఆర్థిక సంక్షోభాలు ఏర్పడుతూనే ఉన్నాయి.