ఆదిత్య రాయ్ కపూర్
From Wikipedia, the free encyclopedia
ఆదిత్య రాయ్ కపూర్ (జననం 16 నవంబరు 1985) ప్రముఖ బాలీవుడ్ నటుడు. మొదట చానల్ వి లో వీడియో జాకీగా పనిచేసేవారు. లండన్ డ్రీమ్స్(2009) సినిమాలో ఓ చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన ఆదిత్య యాక్షన్ రీప్లే(2010), గుజారిష్(2010) సినిమాల్లో సహాయ నటునిగా నటించారు. 2013లో ఆషికి 2 సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత యే జవాహీ హై దివాని సినిమాలో సహాయ నటునిగా కనిపించారు. ఈ సినిమా భారి విజయాన్ని నమోదు చేసుకుంది. అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా కూడా నిలిచింది.
త్వరిత వాస్తవాలు ఆదిత్య రాయ్ కపూర్, జననం ...
ఆదిత్య రాయ్ కపూర్ | |
---|---|
జననం | (1985-11-16) 1985 నవంబరు 16 (వయసు 38) ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
విద్య | సెయింట్. జేవియర్స్ కాలేజ్, ముంబై |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
మూసివేయి